Header Banner

బెజవాడలో భారీ తిరంగా ర్యాలీ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి!

  Fri May 16, 2025 21:19        Politics

నగరంలో వేలాది మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యే, భాజపా, తెదేపా, జనసేన నాయకులు, నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు. జాతీయ జెండా చూడగానే దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. "మహిళల సిందూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ చెప్పింది. ఉగ్రవాదులు ఈ దేశంపైకి కన్నెత్తి చూడకుండా జవాబిచ్చాం. దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు. వారి భూ భాగంలోకి వెళ్లి ఉగ్రతండాలను ధ్వంసం చేశాం.

 

ఇది కూడా చదవండి: ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

దేశ రక్షణలో పాతికేళ్ల కుర్రాడు మురళీ నాయక్ మనకు స్ఫూర్తి. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా అంతం చేయాలని మోదీ సంకల్పం తీసుకున్నారు. భారత్పై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. మీ కుట్రలు, కుతంత్రాలు భారత్ను ఏమీ చేయలేవు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ ఉన్నారు" అని చంద్రబాబు అన్నారు.. "భారత్లో జరిగిన ఉగ్రదాడులన్నింటిలో పాకిస్థాన్ హస్తం ఉంది. వారి దేశాన్ని పాలించుకోలేక.. అభివృద్ధి చెందుతున్న భారత్లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో పేలుళ్లకు పాల్పడింది. భారత్ అభివృద్ధిని చూసి పాకిస్థాన్ అసూయతో రగిలిపోతోంది. మన దేశం అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేక శత్రుదేశం అనేక దాడులు చేసింది. పోతే సైనికుడిగా పోవాలి అని మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశ భక్తి అంటే ఏంటో మురళీ నాయక్ చేసి చూపించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీకి అండగా ఉంటాం. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. ఇది కొత్త భారతం అని పాకిస్థాన్ గ్రహించాలి. తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రజలకు అభినందనలు" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations